కలెక్టర్ మేడం.. జరదేఖో!
- జగ్గయ్యపల్లిలో అక్రమాల కలకలం
- అనుమతుల నుంచి జీతాల వరకు అవినీతి
- రికార్డుల నుంచి నిధుల వరకు దుర్వినియోగం
- గ్రామస్తుల ఫిర్యాదుతో వెలుగులోకి..
కరీంనగర్/మనకొండూర్, మే20(విజయక్రాంతి); కరీంనగర్ జిల్లా మనకొండూర్ మండలం జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీలో 2019-2025 మధ్య కాలంలో అవినీతి, అధికార . దుర్వినియోగం జరిగింది మనకొండూర్ మండల కేంద్రం లోని ఒక కాలనీ అంత లేని ఆ చిన్న గ్రామంలో పంచాయతీ నిధులను అప్పనంగా దోచుకున్నారు. చర్యలు తీసుకోబలసిన అధికారులు నిదులు కాజేసిన వారిని వెనకేసుకువస్తుండటంతో ఊరు ఊరంతా ఒక్కటై ఆందోళనకు సిద్దం అవుతున్నారు.
ఇంటి అనుమతులు, మ్యుటేషన్లు, ఇంటిపన్నుల వసూళ్లు, గ్రామసభ తీర్మానాలు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, అభివృద్ధి పనుల నిధుల వినియోగం వంటి అనేక అంశాల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆర్ టి ఐ ద్వారా బయటకు వచ్చిన పత్రాలు, రికార్డులు, చెల్లింపుల వివరాలతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.జగ్గయ్యపల్లి గ్రామం సూడా పరిధిలో ఉండగా, ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిన అధికారం గ్రామ పంచాయతీకి లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
అయినప్పటికీ అప్పటి పంచాయతీ కార్యదర్శి తప్పుడు పర్మిషన్ పత్రాలు సృష్టించి ఇంటి అనుమతులు ఇచ్చినట్టు ఆధారాలున్నాయి. వాటిని నిజమైన ప్రభుత్వ అనుమతులుగా నమ్మిన ప్రజలు సంవత్సరాల పాటు ఇంటిపన్నులు చెల్లించగా, తరువాత ప్రభుత్వ రికార్డుల్లో తమ ఇళ్ల వివరాలే లేవని గుర్తించినట్లు సమాచారం. 50 మందికి పైగా బాధితులు న్యాయం కోసం ఈరోజుకు ఎదురు చూడడం గమనార్హం. అనుమతులు లేని ఇళ్లకు కూడా నంబర్లు కేటాయించి ఇంటిపన్నులు వసూలు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
వసూలైన పన్ను మొత్తాల్లో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని, 20232024లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు రూ.82 వేల నగదు ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదని సమాచారం. ప్రజల నుంచి వసూలైన పన్ను డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై పూర్తి స్థాయి ఆర్థిక విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి ఒక ఇంటికి మ్యుటేషన్ చేయకున్నా చేసినట్టు ఎన్ ఓ సి సర్టిఫికెట్ సృష్టించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనికి ఆ సర్టిఫికెట్ ను జారీ చేసినట్టు ఆధారాలున్నాయి.
మండల పరిషత్ అధికారులు ఈ పత్ మోసపూర రూపొందించినవిగా గుర్తించినట్లు సమాచారం. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వ్యవహారం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318 కింద చీటింగ్ కేసుగా పరిగణించే అవకాశం ఉంది.చెంజర్ల గ్రామంలో నిర్వహించిన పనుల ఫోటోలను జగ్గయ్యపల్లిలో చేసిన పనులుగా చూపిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వ్బుసైట్లో అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ పనులకు సంబంధించిన రూ.60 వేలకుపైగా నిధులను అప్పటి కార్యదర్శి తన బావమరిది ఖాతాకు బదిలీ చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
(రెండవ భాగం రేపటి సంచికలో)






