21 May, 2026 | 2:59 AM

మెడికల్ షాపుల బంద్

21-05-2026 01:33 AM

ఆన్‌లైన్ నిబంధనలు రద్దు చేయాల్సిందేనని యజమానుల డిమాండ్

హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 20: ఆన్‌లైన్‌లో మందుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నియమ నిబంధనలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం చేపట్టిన బంద్ విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు  మూతపడ్డాయి. పలు రాష్ట్రాల్లో మందుల కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పలేదు. దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి.

ఒక్క తెలంగాణాలో సుమారు 25వేల మెడికల్ షాపులు మూతపడగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 12వేల షాపు లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని డ్రగ్ కం ట్రోల్ అథారిటీ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. బంద్ సందర్భంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జనరల్ సెక్రెటరీ రాజీవ్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. నకిలీ ప్రిస్కిప్షన్ల ఆధారంగా ఔషధాలను సరఫరా చేయ డం ప్రజల ఆరోగ్యానికి ముప్పన్నారు. 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తే చిన్న మెడికల్ షాపుల భవితవ్యం అంధకారంలో పడ్డట్టే అని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఆధారిత ఫార్మసీల వల్ల సామాన్య, చిన్న కెమి స్టుల జీవనోపాధి ప్రమాదంలో పడ్డదని ఆ వేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ వల్ల యాం టీబయోటిక్స్ నియంత్రణ లేకుండా విక్రయిస్తున్నారని ఆరోపించారు.

ఇదిలాగే కొనసా గితే భవిష్యత్‌లో మనుషుల్లో వచ్చే రోగాలపై మందులు పనిచేయకపోవచ్చన్నారు. ఈ రం గంలో ఏఐ సాంకేతికత కూడా ప్రజల ప్రా ణాలకు మరింత ముప్పుగా పరిణమించిందన్నారు. కాగా బంద్‌లో అత్యవసర వైద్యసే వలు అందుబాటులో ఉండేందుకు కొన్ని ఫార్మసీలకు మినహాయింపునిచ్చారు. ఆసుపత్రులకు అనుబంధంగా పనిచే స్తున్న మెడి కల్ షాపులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కేం ద్రాలు, 24 గంటల ఫార్మసీలు, జన్ ఔషధి కేంద్రాలను ప్రభుత్వం తెరిచి ఉంచేలా ఏర్పా ట్లు చేసింది.

కోవిడ్ సమయంలో ప్రజలకు మందులు అందుబాటులో ఉండే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్, డోర్ డెలివరీకి అనుమతిచ్చింది. అనంతరం కూ డా కార్పొరేట్, ఈ ఫార్మసీలు ఇదే విధానాన్ని కొనసా గిస్తూ ఆన్‌లైన్ ద్వారా మం దుల అమ్మకాలతో మరింత విస్తరించాయి. కాగా ఈ బంద్ లో పశ్చిమ బంగాల్, కేరళం, పంజాబ్, మ హారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసోసియేషన్లు పాల్గొనలేదు.