సామాన్యులకేనా రూల్స్!
కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల పుట్టినరోజు వేడుకలు
నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి) : హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై పోలీసు అధికారుల పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమయ్యాయి. కేబుల్ బ్రిడ్జిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ సెల్ఫీలు దిగడం, పుట్టిన రోజు వేడుకలు నిషేధిస్తూ గత నెల 16వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్ 188 ప్రకారం శిక్షర్హులం టూ గతంలో ప్రటనలు చేసిన సీఐ మల్లేష్, ఆయనే రూల్స్ బ్రేక్ చేసి కేబుల్ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ క్రమం లో కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ సీఐ మల్లేశం, పఠాన్‌చెరు ట్రాఫిక్ సీఐ శ్రవణ్, రాజేంద్రనగర్ సీసీఎస్ సీఐ సంజయ్ ముగ్గురు కలిసి బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రూల్స్ సామాన్యులకేనా, పోలీసులకు ఉండవా? అంటూ నెటిజ న్లు కామెంట్ చేస్తున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మాదాపూర్ డీసీపీ విచారణ చేపట్టారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకు నేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై సీఐ మల్లేష్ స్పందిస్తూ తాను కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్‌పైనే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నానని స్పష్టం చేశారు. బ్రిడ్జిపై వాహనాలు ఆపి పుట్టినరోజు చేయలేదని, తాము నిబంధనలు ఉల్లంఘించలేదని వివారణ ఇచ్చారు.




