31 March, 2026 | 9:16 AM

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించండి

06-05-2024 12:04 AM

బీజేపీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి 

వికారాబాద్, మే 5 (విజయక్రాంతి) : మోదీ మూడోసారి ప్రధాని కావడం ఈ దేశానికి ఎంతో అవసరమని బీజేపీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం వికారాబాద్‌కు వచ్చారు. బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నివాసంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ మరోసారి ప్రధాని అయితే ప్రపంచంలోనే భారత దేశం అతిపెద్ద మూ డో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. పది ఏండ్ల పాలనలోనే ప్రపం చ దేశాలు భారత్‌వైపు చూసే విధంగా అభివృద్ధి సాధిం చిందని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మోదీ ఏ వర్గానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ గాలి వీస్తుందని తెలిపారు. తెలంగాణ లో కూడా 12 నుంచి 15 సీట్లు గెలువబోతున్నట్లు తెలిపారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ ప్రాంతంవాడని ఎక్కడ ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసునన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ౧౧న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌కు వస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఏపీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉదయం ౧౦గంటలకు సభ ప్రారంభం అవుతుంది. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, పాండుగౌడ్, గిరధర్‌రెడ్డి పాల్గొన్నారు.