calender_icon.png 24 November, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగిలో డ్రగ్స్ పట్టివేత.. బెంగాల్ నుంచి హైదరాబాద్‎కు హెరాయిన్

24-11-2025 11:27:44 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station) పరిధిలో డ్రగ్స్ పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ సరఫరా చేస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల మెరుపుదాడుల్లో 4.5 గ్రాముల హెరాయిన్ ను పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన దాల్మియా, అక్కన్ బర్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి, చందానగర్ కొల్లూరు పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. చందానగర్ లో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొల్లూరులో 42 కేజీల గంజాయి సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.  మైహోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా ఎస్ఓటీ టీమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.