calender_icon.png 24 November, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ

24-11-2025 11:08:06 AM

హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(iBomma Ravi) పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఐదోరోజు విచారణ అనంతరం పోలీసులు రవిని కోర్టులో హాజరపర్చనున్నారు. సినిమాల పైరసీ ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో పొంతన లేని కొన్న సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దేశ, విదేశాల్లో వందలాది ఏజెంట్లను నియమించుకున్నట్లు గుర్తించారు. విచారణలో విదేశీ సర్వర్లు, యూకే, కరేబియన్ లో ఏజెంట్ల గురించి ఏమీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ ఏర్పాటుపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు డిలీట్ చేసిన డేటా రికవరీకి ప్రయత్నిస్తున్నారు. రవి అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు సీసీఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు. పైరసీ మొత్తం తాను ఒక్కడినే చేశానని రవి అంటున్నాడు. వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్ తో అన్నీ తానే చేశానని తెలిపాడు. సర్వర్, వెబ్ సైట్ ల వివరాలు మాయం చేశాడు. తన అరెస్టు ముందే ఊహించానని ఐబొమ్మ రవి చెప్పాడు. మూడు నెలలుగా ఐబొమ్మ రవి కదలికలపై పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే.