రెండున్నర ఏళ్ల తర్వాత అధికారం మాదే
నిర్మల్ లో కేటీఆర్
నిర్మల్,(విజయక్రాంతి): అడ్డగోలు హామీలతో అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన విస్మరించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జైల్లో ఉన్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిసేందుకు వెళుతున్న సందర్భంగా నిర్మల్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్థానిక గంజాల్ టోల్ ప్లాజా వద్ద బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు కేసీఆర్ కేటీఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెండున్నర ఏళ్ల పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. ప్రజలకు ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను వంచించి మోసం చేశారని ద్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను అధికారం అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించడం సిగ్గుచేటు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కి ఉద్యమాలు జైలు కొత్తవి కావని ఎంత హింసించిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేతనపల్లిలో స్పష్టమైన మెజార్టీ ఉన్న ప్రభుత్వం తమకు అధికారం ఇవ్వకుండా అడ్డుకొని తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించాలని తప్పకుండా దానికి మూల్యం చెల్లిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రెండున్నర ఏళ్ల పాలన కొమ్ములాటలు కుతంత్రాలు కుట్రలు తోనే సాగుతుందని ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదని హెచ్చరించారు.
బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ గుండె చప్పుడు అని ఇది పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన బి ఆర్ ఎస్ రాష్ట్రంలో 40 శాతం ఓట్లు సాధించుకుందని గుర్తు చేశారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నేతలకు భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అధైర్య పడవద్దని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రజల హక్కుల కోసం కలిసి పోట్లాడుదమని పిలుపునిచ్చారు.
బాల్క సుమన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు నేతలపై పెట్టిన కేసులను ప్రభుత్వం బె షరతుగా రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ కూడా నిష్పక్షవాతంగా వివరించాలని అధికార పార్టీకి తొత్తు పలుకుతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, లోలం శ్యాం సుందర్, కిరణ్ కారి, మార్గొండ రాము, అయ్యన్న గారి రాజేందర్, భూషణ్ రెడ్డి తదితరులు ఉన్నారు




