24 February, 2026 | 5:18 PM

మామ ఉప్పలయ్య జ్ఞాపకార్థం... విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ

24-02-2026 03:21 PM

తుంగతుర్తి పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తన మేనమామ ధర్మారపు ఉప్పలయ్య జ్ఞాపకార్థం ఆయన సేవా భావాన్ని కొనసాగిస్తూ, ఆయన మేనల్లుడు తుంగతుర్తి సింగల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, స్కేల్ లు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలని, విద్యార్థులకు తోడ్పాటు అందించాలని తన మేనమామ ఉప్పలయ్య  కలగన్న ఆశయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

తన మామ చూపిన మార్గమే మా కుటుంబానికి ఆదర్శమని అని ఆయన తెలిపారు. విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అల్వాల ప్రవీణ్ కుమార్,మందడి కవిత, ఫిజికల్ డైరెక్టర్ కొండగడుపుల యాకయ్య,  గుజ్జ భాస్కర్,సహదేవ్,రాజు, కొండ పరశురాం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.