24 February, 2026 | 7:28 PM

నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

24-02-2026 03:41 PM

జీవో నెం.25ను వెంటనే రద్దు చేయాలి

ఎస్టీయూటీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్

భైంసా,(విజయక్రాంతి): ఎల్వి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సముదాయ సమావేశం సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు జీవో నెం.25ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్.భూమన్న యాదవ్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

అవసరమైన ఉపాధ్యాయుల నియామకాన్ని డీఎస్సీ ద్వారా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నెం. 25 వల్ల అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి. నరేందర్, కోలూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మల్లన్న, ఉపాధ్యాయులు అయుబ్, గణేష్, మోహన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.