15 March, 2026 | 8:07 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అంబారిపేట్‌లో కన్నుల పండుగగా రేణుక–జమదగ్ని కళ్యాణం

24-02-2026 03:38 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలం అంబారిపేట్ గ్రామంలో శ్రీ ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కళ్యాణ వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, ఉత్సవ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత–అనిల్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తె మట్టెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపసర్పంచ్ సత్యగౌడ్‌తో పాటు గౌడ కులస్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలు గ్రామ ఐక్యతను, భక్తి భావాన్ని మరింత బలపరిచాయని పెద్దలు తెలిపారు.