14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ఎప్పుడు ఎన్నికలు జరిగిన.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

24-02-2026 03:21 PM

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మజ్లిస్ బెదిరిస్తోంది:

భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తాం

హైదరాబాద్: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం(Charminar Bhagyalakshmi Temple) శక్తివంతమైన ప్రదేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) అన్నారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కుంటున్నానని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా..  వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణ దేవాలయం వలే నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మోదీ పాలనలో భారత్.. హిందువులకు సురక్షిత దేశంగా మారిందన్నారు. ఇవాళ ఇతర దేశాల్లోని హిందువులు భారత్ కు వస్తున్నారని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Government) మజ్లిస్ పార్టీ బెదిరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.