7 July, 2026 | 4:02 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్   •   భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •  

మాదిగ ముద్దుబిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడం పట్ల హర్షం

09-06-2025 05:04 PM

తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న..

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నిక్కసైన మాదిగ జాతికి చెందిన అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కర్గే, సోనియాగాంధీ, భావి ప్రధాని రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కృషి పట్ల మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... మంత్రివర్గంలో స్థానం దక్కేటట్లు కృషి చేసిన మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు వారి యొక్క ఐక్యతను అధిష్టానానికి మంత్రివర్గానికి తెలియజేసి మంత్రివర్గంలో నిక్కసైన మాదిగలకు స్థానం దక్కేటట్లు కృషి చేసిన మాదిగ సామాజిక వర్గ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

అంతేకాకుండా సామాజిక న్యాయం పాటించి దళిత బహుజనులకు ,మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధిష్టానం వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకల వెంకన్న గొట్టిపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు. చందా వెంకన్న తాజా మాజీ సర్పంచ్. మాజీ సర్పంచ్ కోతి రాములు చింతకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.