7 July, 2026 | 2:57 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

09-06-2025 05:15 PM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన భూభారతి-2025 రెవెన్యూ చట్టం ప్రకారం భూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలోని బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లోని గొల్ల చర్ల ముల్కనూరు కొత్తపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి చట్టం గ్రామ సమస్యలకు పరిష్కారం చూపుతుందని, ఈనెల 20 వరకు నిర్వహించే సదస్సులను వినియోగించుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్లు నాగరాజు, ఇమ్మానియేల్, శారద ఉన్నారు.