15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రోడ్డు ప్రమాదంలో మాదిగ ఉద్యమనేత మృతి

13-04-2025 08:23 AM

పెద్ద దిక్కు కోల్పోయిన భద్రాచలం మాదిగ ఉద్యోగ సమాఖ్య

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కట్టకూరు నాగభూషణం(Kattakuru Nagabhushanam) ఈ పేరు తెలియని వారు లేరు. భద్రాచలం డివిజన్(Bhadrachalam Division) లో గడిచిన 40 యేండ్ల గా ఐటీడీఏలో ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహించారు, గత సంవత్సరం రిటైర్ అయ్యారు. పాల్వంచలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

వర్గీకరణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు మంధ కృష్ణ  పిలుపు అందుకున్న నాగాభాషణం M.E.F లో పలుహోదాల్లో  పని చేసి ఉద్యమాన్ని  ముందుండి నడిపారు .  M.R.P.S కు పెద్ద దిక్కుగా   వ్యవహరిoచారు. వర్గీకరణ ఉద్యమంలో బంద్,ర్యాలీలు, చలో హైదరాబాదు వంటి కార్యక్రమాలకి నాయకత్వం వహించారు. త్వరలో వర్గీకరణ జీవో రానున్న సమయంలో అనంత లోకాలకు వెళ్లడం మాదిగ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకో లేక పోతున్నారు . ఆయన మృతి పై పలువురు M.E.F M.R.P.S నేతలు సంతాపం వ్యక్తం చేశారు.