28 June, 2026 | 4:10 PM

Breaking News

నిండు జీవితానికి రెండు చుక్కలు   •   తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు   •   లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •  

మాదిగలకు 11 శాతం పదవులివ్వాల్సిందే

20-04-2026 01:54 AM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి 

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ జనాభాలో మాదిగలే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిందని, ఆ మేరకు ప్రభుత్వ పదవులు కేటాయించా లని ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి అన్నారు. మొత్తం జనాభాలో మాదిగలు 10.3 శాతం అంటే దాదాపు 37 లక్షలు ఉన్నారని ప్రభుత్వమే చెప్పిందని ఆదివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో అతి పెద్ద జనాభాగా ఉన్న మాదిగలకు అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, కేటాయిస్తున్న పదవులకు పొంతన లేదని, ఏ పదవుల్లోనైనా మాదిగలకు 11 శాతం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.