27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

జాతీయ పురస్కారానికి మాడిశెట్టి ప్రశాంత్ ఎంపిక

10-01-2026 05:11 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో ఉత్తమ రక్తదాతలు, ఉత్తమ రక్తదాత మోటివేటర్లకు జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, వ్యక్తులను ఈ కార్యక్రమంలో సత్కరించనున్నారు.

2025 సంవత్సరంలో అధిక సంఖ్యలో రక్తదాతలను సమీకరించి, రక్తం అవసరమైన అనేక మందికి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన వారికి ఈ పురస్కారాలు అందజేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రజాసేవకుడు, రక్తదాత, బ్లడ్ డొనర్ ఆర్గనైజర్ మరియు మోటివేటర్ మాడిశెట్టి ప్రశాంత్‌ను ఉత్తమ రక్తదాత మోటివేటర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు IVF జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, IVF సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి పురస్కారానికి మాడిశెట్టి ప్రశాంత్ ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.