10-01-2026 05:13:52 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్న భీమ్ మిషన్ ఐడియాలజీ (బిఎంఐ) కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్‌గా కుసుమ విజయను నియమించారు. హైదరాబాద్‌లోని బిఎంఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దామాల సర్సయ్య, ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మీ నారాయణలు కుసుమ విజయకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు దామాల సర్సయ్య మాట్లాడుతూ... ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బిఎంఐ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.జిల్లా స్థాయిలో యూత్ విభాగం, మహిళా విభాగం, కల్చరల్ విభాగం వంటి కమిటీలను కూడా నియమించుకోవాలని తెలిపారు. దళిత సమాజాన్ని విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా బిఎంఐ పనిచేస్తోందని పేర్కొన్నారు. జిల్లా యువత, మహిళలను భాగస్వాములుగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించినున్నట్లు తెలిపారు.