17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ముగిసిన మాగంటి గోపీనాథ్ అంతిమ కార్యక్రమాలు

08-06-2025 04:29 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ కార్యక్రమాలు పూర్తియ్యాయి. ప్రభుత్వ లాంఛనలతో మాగంటి అంతిమ సంస్కారాలు ముగిశాయి. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి గౌరవవందనం సమర్పించిన పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఆయన కుమారుడు చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దుఖిస్తూు ,చితికి నిప్పు అంటించాడు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5.45 గంలటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది. మాగంటి అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పాడె మోశారు.