28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

మరాఠీ మాట్లాడకపోతే లైసెన్స్ రద్దు!

17-04-2026 12:28 AM

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

ముంబై, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువస్తోంది. మే 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషపై పట్టు ఉండటం తప్పనిసరి. డ్రైవర్లు మరాఠీ చదవడం, రాయడం నేర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు.

ఈ నిబంధనను పాటించని వారి లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (ఆర్టీఓ) తనిఖీలు నిర్వహిస్తారు. దీనిపై విపక్షాలు, డ్రైవర్ యూనియన్లు మండిపడుతున్నాయి. లైసెన్సులు రద్దు చేస్తామనే హెచ్చరిక చాలా తీవ్ర మైనదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరాఠీ భాషను గౌరవించడం అవసరమే అ యినా, ఇలాంటి చర్యలు సమాజంలో విభజన తెస్తాయని ఆరోపించింది.