17 April, 2026 | 2:31 AM

ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య శాంతి ఒప్పందం

17-04-2026 12:22 AM

బీరుట్/ టెల్‌అవీవ్, ఏప్రిల్ 16: ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తాజా ఒప్పందం ప్రకా రం రెండు దేశాల మధ్య పదిరోజుల పాటు యుద్ధం నిలిచిపోనున్నది. అమెరికాతోపాటు ఇతర గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు విజయవంతమయ్యాయి. ఆయా దేశాల సూచనలతో పాటు అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని రెండు దేశాలు భావించడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకున్నది. ఒప్పందం పట్ల ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనడానికి ఇది ఒక గొప్ప ముందడుగని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా నిర్ణ యం వల్ల లెబనాన్ ప్రజలకు గొప్ప ఊరట అని చెప్తున్నారు.