మహాత్ముని స్ఫూర్తితో గ్రామాలకు మహర్దశ
పదేళ్లలో చౌడారం గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుకున్నాం
ఇంద్రనగర్ బాల ఆంజనేయ ఆలయం పునఃనిర్మాణానికి భూమి పూజ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, మార్చి 8 (విజయక్రాంతి): మహాత్ముని స్ఫూర్తితోనే కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోనీ గ్రామాలకు మహర్థశ వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలో గాంధీ విగ్రహం ఆవిష్కరించి, గ్రామంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను హరీష్ రావు ప్రారంబించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతు మహాత్మా గాంధీ, అహింసా మార్గదర్శి, ఆయన జీవితం గొప్ప సందేశమన్నారు. గ్రామ స్వరాజ్యం స్పూర్తితో పల్లెల అభివృద్ధికి కేసీఆర్ పాటుపడ్డారని గాంధీ జి కలలు నిజం చేసారనీ, 60ఏళ్లలో చేయని అభివృద్ధి పదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి చేశారని చెప్పారు. పదేళ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో చౌడారం గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా నిలుపుకున్నామని, ఐక్యతతో ఉండి మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గ్రామానికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు.
భూమి పూజ..
సిద్దిపేట పట్టణంలోని ఇంద్రనగర్ బాల ఆంజనేయస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ఆదివారం హరీష్ రావు భూమి పూజ చేశారు ఆలయాల అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనంతరం సిద్దిపేటలో జరిగిన పలు వివాహ, శుభ కార్యాలయాలు హరీష్ రావు పాల్గొని ఆశీర్వదించారు.




