10 March, 2026 | 8:23 PM

బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవం

09-03-2026 01:15 AM

బెజ్జంకి, మార్చి8: సిద్దిపేట జిల్లా  బెజ్జంకి పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు ఆదివారం ఎస్‌ఐ  బి. సౌజన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ సిబ్బంది తమ తల్లులు, భార్యలను పోలీస్ స్టేషన్కు ఆహ్వానించి పూలమాలలు వేసి సన్మా నించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సౌజన్య మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది విధుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళల భద్రత పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, మహిళలు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.