మహోర్ టీజీ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభం
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపో నుండి నుండి మహోర్ కు బస్సు సౌకర్యం కల్పించినట్టు నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. భక్తులు, ప్రజల విజ్ఞప్తి మేరకు నిర్మల్ నుండి పవిత్ర క్షేత్రాలు అయినా రేణుక మాత, దత్తత్రేయ, అనసూయ మాత దేవాలయినా మహోర్ కు ప్రతిరోజు బస్సు సర్వీసు ఉంటుందని వివరించారు.
నిర్మల్ నుండి ఉదయం 06.20 కి బయలుదేరి 10.20 కు చేరుకొని అక్కడి నుండి 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 కు నిర్మల్ చేరుకుంటుందని, మరొక బస్సు 12.50 ని!! లకు నిర్మల్ నుండి బయలుదేరి సా!! 4.50 ని!! చేరుకొని మహోర్ నుండి సా!! 05.00 గం!! లకు బయలుదేరి రాత్రి 9 గం!! లకు నిర్మల్ చేరుకుంటుందని, ఉదయం బస్సుకు వెళ్లిన వారు సాయంత్రం బస్సుకు దర్శనాలు చేసుకొని తిరిగి రావచ్చని ఆయన తెలిపారు. ఈ బస్సులో మహిళలకు తెలంగాణ బార్డర్ వరకు ఆధార్ కార్డ్ పై ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని డిపో మేనేజర్ తెలిపారు.




