23 May, 2026 | 7:48 PM

తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు

23-05-2026 06:57 PM

జిన్నారం/అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజీపల్లి ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భర్త అరికెల సురేష్ తప్పు తాను చేసి నిందలు తమపై వేయడం సరైన పద్ధతి కాదని గ్రామస్తులు మైలారం భీమా, చిరుమని సురేష్, శాగ అశోక్ హెచ్చరించారు.  శనివారం మైలారం భీమా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 8వ వార్డు కౌన్సిలర్ సంధ్య భర్త అరకెల సురేష్ తానే కౌన్సిలర్ అన్న భ్రమలో  విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

ఈమధ్య  ఓ క్రషర్  వద్ద కు వెళ్లి యజమాన్యంపై దురుసుగా ప్రవర్తించి డబ్బులు డిమాండ్ చేస్తే యజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి తనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఇదంతా చేస్తున్నార అనడం  సిగ్గుచేయడానికి విమర్శించారు. ఏ ఆధారాలు లేకుండా కేసులు నమోదు కావని తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపితే తగదన్నారు.  మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.