25 August, 2026 | 1:39 AM

తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

23-05-2026 06:59 PM

దొంగలను రిమాండ్ కు తరలింపు

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం లోని  బి. వై నగర్ కి చెందిన అడెపు రవి అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని పగలు సమయాల్లో పట్టణంలో రెక్కీ చేసి తన స్నేహితులు సామల్ల బాలకిషన్, బోదాసు గోపి, వేముల సాయి చరణ్ రెడ్డి, గాజులవేణి అరుణ్ కుమార్, మూల అభిలాష్ లతో ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి మీడియా సమావేశంలో తెలిపారు.

అడెపు రవి గతంలో 18 దొంగతనం కేసులలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాక మళ్లీ నేరాలకు పాల్పడలని నిర్ణయించుకుని, దొంగతనాలు చేస్తు బంగారు,వెండి ఆభరణాలను అమ్మితే  వచ్చిన డబ్బులతో జల్సాల చేస్తున్నాడని, గడిచిన నెల రోజులలో   సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు ఇండ్లలో రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారని,ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈరోజు  ఉదయం నిందుతులు ఏదైనా పెద్ద దొంగతనం చేద్దామని అనుకోని ఆటోలో సిరిసిల్ల కు వస్తుండగా నమ్మదగిన సమాచారంతో సిరిసిల్లలోని ఎల్లమ్మ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.

అదుపులోకి తీసుకున్న నిందుతులను విచారించగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు ముస్తాబాద్ లోని కస్తూరి సాయితేజకి, కొన్ని బంగారు, వెండి ఆభరణాలు వేములవాడలోని శీలం సంతోష్ రెడ్డి కి అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశామని, వారి వద్ద నుండి బంగారు వెండి ఆభరణాలు,నగదు 1500/- రూ.,మోటార్ సైకిళ్ళు,ఆటో స్వాదిన పరుచుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ నాగేంద్ర చారి మీడియా సమావేశంలో తెలిపారు. నిందుతులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది పుల్కమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ , మారుతి, రవి , నాంపెళ్లి శ్రీనివాస్, నాగరాజు లను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.