24 August, 2026 | 11:32 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి

23-05-2026 07:04 PM

మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ కు మలి దశ ఉద్యమకారుల వినతి

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యగుట్ట అమరవీరుల స్థూపాన్ని మరమ్మతులు చేపట్టి జూన్ 2 తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాట్లకు సిద్ధం చేయాలని బాన్సువాడ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ ఖయ్యుం కు మలీ దశ ఉద్యమకారులు జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్, మండల అధ్యక్షుడు గంజి వారి చంద్ లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల స్థూపానికి వాల్ పోస్టర్లు ఇతరత్రా పోస్టర్లు అందించి అమరుల రూపాన్ని అవమాన పరుస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కమిషనర్ కు వారు కోరారు.

అలాగే జూన్ రెండవ తేదీ వరకు అమరవీరుల స్థూపాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయాలని స్తూపం చుట్టూ ఏర్పాటు చేయాలని వారు కోరారు. అమరవీళ్ల స్థూపానికి ఎవరైనా పోస్టర్లు అతికించితే వారికి జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఇన్చార్జి కమిషనర్ ఖయ్యూం అమరుల స్థూపాన్ని మరమ్మతులు చేయించి ముస్తాబు చేస్తామని ఏర్పాట్లు అన్ని విధాలుగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.