23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

సిద్ధిఖీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

11-11-2024 12:24 AM
  1. యూపీలో అదుపులోకి  తీసుకున్న ముంబై పోలీసులు
  2. నేరం అంగీకరించినట్టు పోలీసుల ప్రకటన

ముంబై, నవంబర్ 10: ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఆది వారం అరెస్ట్ చేశారు. సిద్ధిఖీపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్‌తో కలిసి ముంబై పోలీసులు బహ్రాయిచ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడునే పాల్ పారిపోయేందుకు ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. శివకుమార్‌కు యూపీలో ఆశ్రయం కల్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురుని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్టు అతడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. గత నెల 12న సిద్ధిఖీ తన కుమారుడి కార్యలయంలో ఉండగా కాల్పులు జరిగాయి.