30 July, 2026 | 1:44 AM

3.5 ఏళ్లు జైలు.. రూ.4.5 కోట్ల జరిమానా

30-07-2026 12:38 AM
  1. ప్రధాన నిందితుడికి నోట్ల రద్దు మోసంలో శిక్ష
  2. తుదితీర్పునిచ్చిన సికింద్రాబాద్ సివిల్ కోర్టు

సికింద్రాబాద్, జూలై 29 (విజయక్రాంతి): నోట్ల రద్దు సమయంలో పాత కరెన్సీ మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు అంతతాలి యాదగిరికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ. 4.5 కోట్ల జరిమానా, మరో 10 మంది నిందితులకు ఒక్కొక్కరికి రూ. 60 వేల చొప్పున జరిమానా విధిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. 2017లో నోట్ల రద్దు సమయంలో బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో కరెన్సీ మార్పిడి మోసం కేసు నమోదైంది.

విచారణలో నిందితులు నేరానికి పాల్పడినట్లు తేల డంతో కోర్టు జైలు శిక్షలతోపాటు భారీ జరిమానాలు విధించింది. పాతనోట్లకు బదులు కొత్త నోట్లు ఇప్పిస్తామని 17మంది సభ్యుల ముఠా పలువురిని మోసం చేసింది. అక్రమంగా రూ. 1.20 కోట్ల కరెన్సీని బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 9మందిపై చార్జీషీట్ దాఖలు చేశారు. దీనిపై సికింద్రాబాద్ సివిల్ కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి తుదితీర్పు వెల్లడించింది.