రైతులు ఆరుతడి పంటలు పండించాలి
జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్
గుమ్మడిదల, జూలై 29: మండలంలోని పంటల పరిస్థితిని జిల్లా వ్యవసాయ అధికారి కె.శివప్రసాద్ బుధవారం రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అరుతడి పంటలైన కంది, మొక్కజొన్న,జొన్న, కూరగాయలు,సోయబీన్, పప్పు ధాన్యాలు,చిరు ధాన్యాలు సాగుచేయాలని కోరారు.
భవిష్యత్లో ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం వున్నందున అధికంగా నీళ్లు అవసరం వున్న పంటలైన వరి,చెరకు సాగు తగ్గించాలని రైతులను కోరారు. గుమ్మడిదల మండలంలోని వానకాలంలో సుమారు 700 ఎకరాలు కంది 1200 ఎకరాలు మక్కలు, 300 ఎకరాలు కూరగాయలు,1500 ఎకరాలు వరి ప్రస్తుతం సాగవుతున్నాయని, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సరిపడా ఉన్నాయని ఏవో డి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరిశీలనో పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి ఏఈఓ లు యం.సుమిత, కె.వందన రైతులు పాల్గొన్నారు.






