శాంతి భద్రతలను కాపాడాలి
17-06-2024 12:10 AM
ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సూచన
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) : కేసీఆర్ పాలనలో తెలం గాణ శాంతియుతంగా ఉందని, కాం గ్రెస్ అధికారం చేపట్టిన మత కలహాలు ప్రారంభమయ్యాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మెదక్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా మత ఘర్షణలు జరిగాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాలని, గొడవలు జర గకుండా చూడాలని కోరారు.






