విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
17-06-2024 12:10 AM
బీసీటీఏ సన్మాన కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, జూన్ 16 ( విజయక్రాంతి) : నాగర్ కూర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) సన్మానించింది. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ విద్యారం గం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రభుత్వ కృషి చేస్తు న్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కృష్ణుడు, ఉపాధ్యక్షుడు, రాములు, వెంకటయ్య, బీకే వెంకటేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.






