25 March, 2026 | 3:05 AM

గంజాయి, డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక నిఘా పెట్టండి

25-03-2026 12:55 AM

లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి వినతి

కడ్తాల్, మార్చి 24( విజయక్రాంతి) రం గారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో గంజా యి, మాదకద్రవ్యాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సర్పంచుల సం ఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఎక్సైజ్ భవన్లో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవికి ఆయన వినతిపత్రం సమర్పించారు.

కడ్తాల్, ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో డ్రగ్స్ వినియోగంపై దృష్టి సారించా లని కోరారు.మాదకద్రవ్యాల వల్ల యువత ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, కుటుంబ కలహాలు, నేరాలు మరియు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాలలు, కళాశాలల్లో యువత ను చైతన్య పరిచేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.పోలీస్, ఎక్సైజ్ శాఖలు మరియు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ విన్నపంపై అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి సానుకూలంగా స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.