25 March, 2026 | 3:05 AM

టీఐఐసీ కోసం స్థల పరిశీలన చేసిన అదనపు కలెక్టర్

25-03-2026 12:56 AM

మేడ్చల్, మార్చి 24 (విజయ క్రాంతి): తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా ర్పొరేషన్ కు కేటాయించడానికి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని 608 సర్వే నంబర్ లో స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను త హసిల్దార్ భూపాల్ అదనపు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భూపాల్, ఆర్ ఐ కుమార్ పాల్గొన్నారు.