24 August, 2026 | 2:47 AM

శాంతి భద్రతల రక్షణ అందరి బాధ్యత

24-08-2026 02:17 AM

డీఎస్‌పీ వెంకటేశ్వర్లు

రాజాపూర్ ఆగస్టు 23: శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని డి.ఎస్.పి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో డిఎస్పి ఆధ్వర్యంలో  ఉదయం 60 మంది పోలీసు అధికారులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వాహన పత్రాలు సరిగ్గా లేని 23 మోటార్ సైకిళ్ళు, కారు స్వాధీనపరచుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముదిరెడ్డిపల్లి గ్రామం సెజ్ సమీపంలో ఉన్నందున ఎక్కువ మంది ఉత్తరది రాష్ట్రాల ప్రజలు జీవనోపాధి కోసం ఇక్కడికి వస్తారని, రూం లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారికి సంబంధిత ఆధార కార్డులు ఫోన్ నెంబర్లు ఇంటి యజమానులు కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు.

గ్రామాలలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా బాధ్యత వహించాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల వారు మత్తు పదార్థాలను అధికంగా జీవిస్తారని గంజాయి డాగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి రమణారెడ్డి, సిఐ లు మహేష్, కమలాకర్, ఎస్త్స్ర రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.