సామాజిక సమస్యల పరిష్కారానికి... కాలనీవాసుల సహకారం ఎంతో అవసరం
జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి
జవహర్ నగర్,(విజయక్రాంతి): కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణ సామాజిక సమస్యల పరిష్కారానికి కాలనీవాసుల సహకారం ఎంతో అవసరమని జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ ప్రగతి నగర్ వాసులు తమ కాలనీ సామాజిక సమస్య శాంతి భద్రతల సమస్య గూర్చి మునగాల నరసింహ ఆధ్వర్యంలో బుధవారం జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మునగాల నరసింహ మాట్లాడుతూ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సామాజిక సమస్యలైన డ్రగ్స్, గంజాయి, తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.
ముఖ్యంగా యువత ఈ మహమ్మారికి బలవుతున్నారని రాత్రి సమయాలలో మహిళలు విద్యార్థులు బయటికి రావడానికి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నిందితుల వల్ల భయ బ్రాంతులకు గురవుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏసీపీకి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఏసిపి చక్రపాణి మాట్లాడుతూ శాంతిభద్రతల సామాజిక రుగ్మతల పరిరక్షణలో కాలనీవాసుల సహకారం ఎంతో అవసరం అన్నారు. అనంతరం ప్రగతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తగరం శ్రీనివాసులు కాలనీవాసులు ఏసీపీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






