మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
24-04-2026 02:55 PM
గుండాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో భాగంగా పినపాక, ఇల్లందు నియోజకవర్గాల శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య ల సూచన మేరకు మండల కేంద్రంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు మొక్కజొన్న కేంద్రం ఫ్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, కాంగ్రెస్ నాయకులు ఖధీర్, వాంకుడోత్ భీకోజీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






