1 May, 2026 | 4:09 AM

తాడువాయిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం

01-05-2026 02:26 AM

తాడ్వాయి,ఏప్రిల్, 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ రావు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విజయ క్రాంతి దినపత్రికలో ఈనెల 29 న ప్రచురితమైన మక్కల కొనుగోలు కేంద్రాలు కరువు.. అనే వార్తకు స్థానిక ఎమ్మెల్యే స్పందించారు.

వెంటనే తాడ్వాయి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మక్కలు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

ప్రతి ఒక రైతు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు ఆకికిటి వెంకటరామిరెడ్డి, సంజీవులు, షౌకత్ అలీ, రామచంద్రం, గంగారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.