1 May, 2026 | 4:07 AM

గ్రేడ్-బీ ద్వారా వరిధాన్యం కొనుగోళ్లు

01-05-2026 02:26 AM
  1. క్వింటాల్ కు రూ.20 నష్టం పోతున్న రైతులు
  2. మిల్లర్ల సిండికేట్..? చేతులెత్త్తేసిన అధికారులు

కోహెడ, ఏప్రిల్ 30: మండలంలో ఐకేపి కేంద్రాలలో వరి ధాన్యం కోనుగోలు గ్రెడ్-బి ద్వారనే కోనుగోలు జరుగుతున్నాయి. ప్రభుత్వం క్వింటాల్ వరి ధాన్యంకు మద్దతు ధర రూ.2389( గ్రెడ్-ఏ), రూ.2369 (గ్రెడ్-బి) కి ప్రకటించింది. కానీ సైస్ మిల్లర్ల యాజమానులు నాణ్యమైన ధాన్యానికి కూడ ఎదో వంక చూపుతున్నారు. సెంటర్ల నుంచి లారీల ద్వార మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని రెండు, మూడు రోజులైన ఆన్లోడ్ చేసుకోకపోవడంతో లారీల కోరత ఏర్పడుతుంది.

దీంతో మిల్లర్లు కావాలనే ఆన్లోడ్ జాప్యం చేస్తున్నారని.. ఐకేపి సెంటర్ల నిర్వహకులు ధాన్యాన్ని లారీల ద్వార మిల్లుకు గ్రెడ్-బి తో ట్రాక్ చిట్లో నమోదు చేయటంతో ఎలాంటి అభ్యాంతరం లేకుండానే ఆల్లోడ్ చేసుకోవడంతో గ్రెడ్-బి తో వరి ధాన్యం కోనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం పై, అధికారులు సైతం మిల్లర్ల సిండికెట్ ను గమనించి మౌనం వహించటం పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

మండల వ్యాప్తంగా బుధవారం వరకు 263 మంది రైతుల నుంచి 19168 క్వింటాలు వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు ఐకేపీ నిర్వహకులు పేర్కోన్నారు. ఇందులో తొలుతగా ఓ మిల్లుకు లారీలో పంపిన 291.20 క్వింటాల్లు ధాన్యాంకు మాత్రమే గ్రెడ్-ఏ ధర కేటాయించటం కొసమెరుపు. కాగా ఈ యాసంగి లో మండల వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం సుమారుగా  2 లక్షల క్వింటాళ్లు వరి ధాన్యం కొనుగోలు కానుంది.

A గ్రేడ్ అంటేనే లారీలు ఆపుతుండ్రు

కేంద్రాల నుంచి మిల్లుల కు A- గ్రేడ్ కింద పంపిన వరి ధాన్యం ను అన్లోడ్ చేసుకోవడం లేదు. దింతో రైతులకు నచ్చ చెప్పి వాళ్ళ ఇష్టనుగుణంగానే గ్రేడ్ -బి కింద మిల్లుల కు పంపుతున్నాము. కొంత మంది మిల్లర్లు గ్రేడ్ -బి ధాన్యాన్ని కూడా అన్లోడ్ లో ఇబ్బంది పెడుతున్నారు. విషయాన్నీ ఉన్నతాధికారులకు  నివేదించాము.

 - శ్రీనివాస్ గౌడ్, ఐకేపీ ఏపీఎం కోహెడ