కొత్తూరులో ఘోర అగ్నిప్రమాదం
ప్లంబింగ్ గోదాం దగ్ధం, రూ.5 లక్షల నష్టం
కొత్తూరు, జూలై 15(విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని బాబూలాల్ గోదాం సమీపంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ గడ్డివాముకు మంటలు అంటుకోగా, అవి కాసేపట్లోనే ప క్కనే ఉన్న ఓం ప్రకాష్ అనే వ్యక్తికి చెందిన ప్లంబింగ్ గోదాానికి వేగంగా వ్యాపించా యి. గోదాంలో భారీగా ప్లాస్టిక్ పైపులు, ఇత ర సామాగ్రి ఉండటంతో మంటలు ఉవ్వెత్తు న ఎగసిపడ్డాయి.
దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






