‘సర్’ను మరింత పూర్తి స్థాయిలో చేయాలి
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్
సికింద్రాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం కొనసాగుతోంది. వివిధ బస్తిల్లో నాయకులు బీ. ఎల్వో లు ఓటర్లకు ఎస్ ఐ ఆర్ పై అవగాహన కల్పిస్తున్నారు. న్యూ బోయినపల్లి చిన్న తోకట్ట, నక్కల బస్తీలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బుధవారం ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్ ఐఆర్ ప్రక్రియ గడువు ఈ నెల 24 వరకు ప్రభుత్వం పెంచడం శుభపరిణామమని అన్నారు. శర వేగంగా పూర్తి స్థాయిలో ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలనీ అధికారులను కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ గందర గోళంగా ఉందని ఓటర్లకు అర్ధం కావడం లేదని బీఎల్వో లు ఓటర్లకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ముఖేష్,లక్ష్మణ్, కొండల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






