7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల
06-07-2026 12:42 PM
హైదరాబాద్: రైతు భరోసా నిధులు విడుదల(Rythu Bharosa Funds) కొనసాగుతోంది. ఆరోరోజు తెలంగాణలో 7 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు. ఇవాళ 92,729 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 354.96 కోట్లను నేరుగా జమ చేశారు. ఇప్పటివరకు 68.37 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. 124.85 లక్షల ఎకరాలకు రూ. 7,490.72 కోట్ల రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.






