6 July, 2026 | 1:40 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు

06-07-2026 01:10 PM

బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరిక...

బాన్సువాడ, జూలై 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో నెంబర్ ప్లేట్ వాహనాలు, నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్లు అతికించిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉండాలని లేనియెడల అలాంటి వాహనదారుడు పై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారూ. ప్రతి ఒక్కరు పోలీస్ విధులకు ఆటకం కలిగించిన అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ వాహనదారులు చట్టాన్ని వ్యతిరేకించకూడదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.