03-02-2026 12:41:10 AM
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి
చేవెళ్ల, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేసిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య , పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ తో కలిసి చేవెళ్ల మున్సిపాలిటీలోని 14, 15,16,18 వార్డుల అభ్యర్థులు మద్దెల శ్రీనివాస్, బండారి శైలజ ఆగిరెడ్డి, దేవర సమత వెంకట్ రెడ్డి, మంగలి కల్యాణి యాదగిరికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తే కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాలిటినీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముడిమ్యాల, చేవెళ్ల పీఏసీఎస్ మాజీ చైర్మన్లు గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మంగలి బాలరాజు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్లు ఆగిరెడ్డి, పడాల రాములు, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, డైరెక్టర్ రాములు, నేతలు గుడిపల్లి పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.