03-02-2026 12:40:29 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఏ మార్పు కావాలని తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉం చారో, రెండేళ్లలోనే ఆ మార్పు స్పష్టంగా చూ పించి, ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అన్ని రంగాలలోనూ, మరీ ముఖ్యంగా ఆర్థిక రంగంలో పెను సంక్షోభమని, ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గట్టెక్కుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నా మని అన్నారు.
సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునికీకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతున్నాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డు లు, ఉపాధి కల్పన వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నా యని తెలిపారు.
ఈ మార్పులను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగు ణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాలనను రెండేళ్లు పూర్తి చేసుకున్నామని, రెండేళ్ల కాలం తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతమని వివరించారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనూ, ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఅండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీఎం సీపీఆర్‌వో జీ మల్సూర్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ రమణ తదితర అధికారులు పాల్గొన్నారు.