calender_icon.png 2 October, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి గిరిజన అభివృద్ధికి తోడ్పడండి

02-10-2025 12:33:18 AM

ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ 

భద్రాచలం, అక్టోబర్ 1 (విజయక్రాంతి):మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలో ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద చేపడుతున్న గిరిజన గ్రామాలలో సంబంధిత నోడల్ అధికారులు డి ఎం టి లు, బిఎంటిలు పగడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సెక్రటరీ ఆఫ్ మోటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ విబు నాయర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

బుధవారం న్యూఢిల్లీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో/టెలి కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల వారీగా ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత గిరిజన ప్రాంతాల అభివృద్ధికై చేపట్టిన కార్యక్రమాలు ప్రతి గ్రామపంచాయతీలో ఆదిశేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో సాతి సహాయోగులను నియమించిన ప్రతి అంశాన్ని వ్బుసైట్లో పొందుపరచాలని అన్నారు.

గ్రామంలోని సమస్యలతో పాటు ఇంటింటికి తిరిగి ఆ కుటుంబాల యొక్క సమస్యలను కూడా తెలుసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. సూచనల ప్రకారము ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐటిడిఏ పరిధిలోని 19 మండలాలలోని 130 గ్రామపంచాయతీలలో గ్రామ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి పోర్టల్ లో పొందుపరచడం కొరకు, విలేజ్ నోడల్ ఆఫీసర్లు, బిఎంటిలు, సాతి సహాయోగులను నియమించడం జరిగిందన్నారు.

వీరి ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో ఆది సేవ కేంద్రాలు ప్రారంభించామని, 130 పంచాయతీలలో ఆదిశేవా కేంద్రాలతో పాటు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించడం జరిగిందనీ ఐటీడీఎ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ వివరించారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, సిబ్బంది కార్తీక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.