02-10-2025 12:31:30 AM
చుంచుపల్లి, అక్టోబర్ 1, (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా కోల్ ఇండియాలో జరుగు కబడ్డీ పోటీలను కొత్తగూడెం ఏరి యా ప్రాంతమైన రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్( పాల లచ్చమ్మ ) మైదానంలో నిర్వహించుటకు సింగరేణి యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. దానికి గాను సం స్థ సి అండ్ ఎండి ఎం బలరాం నాయక్. డైరెక్టర్‌పా గౌతమ్ పోట్రు. డైరెక్టర్ ఆపరేషన్ సూర్యనారాయణ.
డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కొప్పుల వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఈ అండ్ ఎం తిరుమల రావు ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు. మొదలగు వారికి ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. ఐ ఎన్ టి సి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ ధన్యవాదాలు తెలిపినారు.