దానం చేయడం అలవాటు చేసుకోవాలి
24-11-2025 12:00 AM
సత్య సాయి సేవా సమితి అధ్యక్షులు లక్ష్మణ్ రావు
మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 23: రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలని సత్య సాయి సేవా సమితి అధ్యక్షులు లక్ష్మణ్ రావు అన్నారు. భగవాన్ సత్య సాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక వెంకటేశ్వర కాలనీలోని సత్య సాయి మందిరంలో నిర్వహించిన మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని తో కలిసి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటరాజ్ మాట్లాడుతూ సత్య సాయి భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అన్ని దానాల కన్న రక్తదానం మహా గొప్ప దానం అన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు రక్తదానం చేశారని తెలిపారు.






