9 August, 2026 | 2:59 PM

హిందూ యువ సమ్మేళనం విజయవంతం చేయండి

09-08-2026 01:50 PM

బోథ్. ఆగస్టు 9(విజయక్రాంతి): ఈనెల 13న మండల కేంద్రంలో నిర్వహించనున్న హిందూ యువ సమ్మేళనం ను విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచార ఓం నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను యువతలో దేశభక్తి ధర్మ రక్షణ కర్తవ్య నిష్ఠ సామాజిక సేవ భవన్ తో పాటు జాతీయ చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో హిందూ యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హిందూ యువకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.