9 April, 2026 | 8:50 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

06-02-2026 12:00 AM

ఐఎఫ్‌టీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివబాబు

జవహర్ నగర్, ఫిబ్రవరి 5,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ మేడ్చల్ జిల్లా ప్ర ధాన కార్యదర్శి శివబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ కార్యాలయంలో శివబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్‌ను మున్సిపల్ కార్మికులతో కలిసి గురువారం ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా శివబాబు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అందజేయాలని, జీవో 60ను యాథావిధిగా అమలు చేసి 8గంటల పనిదినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ, జయసుధ, రా ములు, వెంకటమ్మ, రేణుక, ఎల్లేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.