9 April, 2026 | 10:41 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రూ. 10 లక్షల విలువచేసే 15.070 కిలోల గంజాయి పట్టివేత

06-02-2026 12:00 AM

భద్రాచలం ఆర్టిఏ ఆఫీసు వద్ద కారులో తరలిస్తున్న  ఎండు గంజాయి  స్వాధీనం

భద్రాచలం, ఫిబ్రవరి 5, (విజయక్రాంతి): భద్రాచలం శివారులోని ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకుని గంజాయిని కారుని స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సిహెచ్ శ్రీనివాస్  సిబ్బందితో కలిసి ఆర్టిఏ ఆఫీసు భద్రాచలం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమా నాస్పదంగా వస్తున్న ఒక  కారు టి జి 08 హెచ్ క్యూ 9088  ను ఆపి తనిఖీ చేయగా దానిలో 15.070  కేజీల  గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ గంజాయి ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా  నిందితుల విచారణలో వెల్లడయ్యింది.

ఈ గంజాయి కేసులో హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన రఘు విష్ణోయి, జ్యోతిపూర్‌కు చెందిన శేఖర్ రామ్‌లు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి  హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడి నారు. తదుపరి విచారణ నిమిత్తం 10, 73,500 రూపాయల గంజాయిని, కారు, 2 సెల్ ఫోన్లు  ఇద్దరు  ముద్దాయిలను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించడ మైనది. ఈ తనిఖీలలో  కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హరీశ్, విజయ్ వీరబాబు, ఉపేందర్ లు పాల్గొన్నారు. భద్రాచలంలో గంజాయిని పట్టుకున్న సిబ్బందిని  ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్ ,తిరుపతి అభినందించారు.